KRNL: పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ జిల్లాలోని తెలుగుగేరిలో లబ్ధిదారులకు ఇవాళ పింఛన్లు పంపిణీ చేశారు. మంత్రి స్వయంగా ఇంటింటికీ వెళ్లి నగదు అందజేశారు. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగిస్తున్నారని, తమ పరిపాలనను పక్క రాష్ట్రాల నాయకులు సైతం అభినందిస్తున్నారని ఆయన అన్నారు. ఈ మేరకు ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని మంత్రి కోరారు.