SKLM: పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కార్తీక మాస ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు దర్శించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రో చ్ఛారణలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాల అందజేశారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు, అర్చకులతో చర్చించారు.