కృష్ణా: మోటారు క్రాస్ రోడ్డు వద్ద నేషనల్ హైవే-216 పై ఎస్సై చంటిబాబు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారులపై ఈరోజు కఠిన చర్యలు తీసుకున్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారు, సీట్‌బెల్ట్ లేకుండా ప్రయాణించే వారు, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.