NRML: కడెం ప్రాజెక్టులో పడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుంట్ల రాజశేఖర్ రెడ్డి గల్లంతయ్యాడని స్థానికులు తెలిపారు. కరీంనగర్ జిల్లా జూలపల్లి సాయికాబి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డి శనివారం ఖానాపూర్లో వివాహానికి వెళ్లే సందర్భంలో మార్గమధ్యలో కడెం ప్రాజెక్టు వద్ద ఫోటోలు దిగి క్రమంలో ప్రాజెక్టులో పడి గల్లంతాయాడని వారు తెలిపారు. పూర్తి వివరాలు రావాల్సి ఉంది.