ATP: తాడిపత్రి పట్టణంలోని 36వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్ జింక లక్ష్మీదేవి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పంపిణీ కొనసాగుతోందని పేర్కొన్నారు.