MNCL: జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి కంపు కొట్టి దుర్వాసన వస్తుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారంలోని రామాలయం నుంచి సాయిబాబా దేవాలయం వరకు ఉన్న ప్రధాన రహదారికి పక్కన డ్రైనేజీ నీరు రెండు నెలలుగా ప్రవహిస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో ఎక్కువగా దుర్వాసన వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారంలో పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ లేదన్నారు.