SKLM: కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం పట్ల కట్టుబడి ఉందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం బూర్జ మండలం లక్కుపురం గ్రామంలో లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి సామజిక పింఛన్లు పంపిణీ చేశారు. అర్హులందరికీ న్యాయం జరిగేలా సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా పారదర్శకంగా అమలు చేస్తున్నామని అన్నారు.