కృష్ణా: ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం పేదలకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శనివారం అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెంలో నిరుపేదలకు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా కూటమి ప్రభుత్వం దివ్యాంగులు, వితంతువులు, వృద్ధుల జీవనానికి భరోసా ఇస్తోందన్నారు.