కృష్ణా: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం గూడూరులో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రతి లబ్ధిదారుడిని చేరుకోవడం తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు. అనంతరం ఆయన లబ్ధిదారులకు పెన్షన్ నగదును అందించారు.