బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీ రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని పీకే స్పష్టం చేశారు. తమ పార్టీకి 150 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని, ఒకవేళ ప్రజలు తమను తిరస్కరిస్తే మాత్రం 10 కంటే తక్కువ సీట్లు సాధిస్తామని పీకే వెల్లడించారు.