RR: షాద్నగర్ పట్టణ కేంద్రంలోని చటాన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులలో కదలిక ప్రారంభమైంది. R&B శాఖ ఎస్ఈ రాజేశ్వర్ రెడ్డి, విద్యుత్ శాఖ డీఏ శ్యాంసుందర్ రెడ్డి, తదితర శాఖల అధికార బృందం బ్రిడ్జ్ నిర్మించే స్థలాన్ని ఈరోజు పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్తో రైల్వే వంతెన నిర్మాణ కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు.