VZM: వంగర MPDO రాజారావు శనివారం స్థానిక మగ్గూరు గ్రామంలో జరుగుతున్న పెన్షన్ పంపిణీని పరిశీలించారు. సచివాలయ సిబ్బందితో దివ్యాంగులు, వితంతువులు, వృద్ధాప్యం, తదితర 363 మంది పెన్షన్దారులకు ఇంటి వద్దనే పెన్షన్ అందజేయాలని సిబ్బందికి ఆదేశించారు. శత శాతం పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.