MBNR: మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో సాదా బైనామా గురించి పెట్టుకున్న దరఖాస్తులను వేగవంతంగా పరిశీలన పూర్తిచేయాలని, భూ భారతి పెండింగ్ దరఖాస్తులను తొందరగా విచారణ చేసి పంపించాలని ఆయన పేర్కొన్నారు.