ADB: భీంపూర్ మండలంలో పులి సంచారం రైతుకు కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా శనివారం మండలంలోని పిప్పల్ కోటి, గూడ గ్రామాల శివారులోని యాల్ల కేశవ్, పొగుల రమేష్ పంట చేలలో పులి సంచరిస్తుండగా పంట చేలకు వెళ్లిన కూలీలు గమనించి భయంతో తిరిగి ఇంటికి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయాన్నిఘమనించి పిప్పల్ కోటి రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.