కృష్ణా: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గుడివాడ 30వ వార్డు ధనియాలపేటలో సచివాలయ సిబ్బందితో కలిసి కూటమి నేతలు పెన్షన్ నగదును ఈరోజు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రతినెల 1వ తేదీనే లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్న సీఎం చంద్రబాబుకు వార్డు ప్రజల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ ఆదినారాయణ, వేణుబాబు పాల్గొన్నారు.