ASR: గంజాయి, నాటుసారా తదితర అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పాడేరు డీఎస్పీ షైక్ షహబాజ్ అహ్మద్ ప్రజలకు సూచించారు. మంగళవారం సీఐ డీ.దీనబంధు, ఎస్సైతో కలిసి డొకులూరు గ్రామ సచివాలయంలో డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి సాగు, రవాణా, నాటుసారా తయారీ, క్రయ విక్రయాలకు దూరంగా ఉండాలన్నారు. లేకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.