VSP: గాజువాకలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి యువ దంపతుల నుంచి రూ.91లక్షలు టోకరా వేశారు. ఈ మోసానికి పాల్పడ్డ ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. అలేఖ్య అనే యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితులు మచ్చ సజిని, వెంకట నారాయణ, సీరాపు శన్ముఖ ఆదిత్య, రామ్ ప్రసాద్, అనితలను అరెస్ట్ చేశారు. వీరు డబ్బు తీసుకుని ఆస్తులు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది.