WNP: వనపర్తి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య నాగమణి, ఆమె ప్రియుడు నందిమల్ల శ్రీకాంత్ కలిసి భర్త కురుమూర్తిని హత్య చేశారు. అక్టోబరు 28న జరిగిన ఈ ఘటనలో ఇద్దరూ కలిసి కుట్ర పన్ని కురుమూర్తిని చంపి, అనంతరం సెల్ఫ్ డ్రైవింగ్ పేరిట కారులో శ్రీశైలం వెళ్లి డ్యాంలో మృతదేహాన్ని పడేశారు. వనపర్తి రెండో ఎస్సై శశిధర్ కేసు నమోదు చేశారు.