సిరిసిల్ల: తంగళ్ళపల్లి, సిరిసిల్ల బ్రిడ్జి పైనుంచి మానేరు వాగులో దూకి గల్లంతైన సల్లంగుల కృష్ణయ్య (55) మృతదేహం శనివారం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం బ్రిడ్జిపై నుంచి నీటిలో దూకి కృష్ణయ్య గల్లంతయ్యాడు. గురువారం నుంచి ఇప్పటివరకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది.