సిరిసిల్ల: జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతుల నుంచి 9వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీకై కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు గురుకుల పాఠశాల కోఆర్డినేటర్ థెరిసా తెలిపారు. సిరిసిల్లలో శుక్రవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 4న ఉదయం 11 గంటలకు చిన్న బోనాలలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు హాజరుకావాలని ఆమె కోరారు.