NZB: నవీపేట్ మండలం ఫకీరాబాద్ శివారులో బాసర వెళ్లే ప్రధాన రహదారి పక్కన వివస్త్రగా గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న నవీపేట్ ఎస్సై తిరుపతి వివరాలు సేకరిస్తున్నారు. తల, కుడిచేయి వేళ్లు లేకుండా మహిళ మృతదేహం కనిపించింది. మహిళను హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.