SKLM: సంతబొమ్మాళి మండలంలోని వడ్డీతాండ్ర గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలు మేరకు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ అట్టాడ తిరుపతి రావు ఆధ్వర్యంలో కార్యదర్శి రామ్ కుమార్ పరిశుద్ధ కార్మికులతో మురికి కాలువలు, రహదారులు శుభ్రం చేయించారు.