విశాఖ మరో అంతర్జాతీయ కార్యక్రమానికి వేదిక అవుతోంది. మూడు నావికాదళ కార్యక్రమాలు నిర్వహించేందుకు నేవీ అధికారులు సిద్దమౌతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 15 నుంచి 25 వరకు విశాఖ తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో 3 ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు జరగనున్నాయి. ఇండియన్ ఫ్లీట్ రివ్యూ-2026, మిలాన్-2026, IOSS కాన్లేవ్ ఆఫ్ చీఫ్స్ వంటి ఈవెంట్లకు విశాఖ వేదిక కానుంది.