GNTR: మేడికొండూరు మండలం యలవర్తిపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. జానిభేగం పర్యవేక్షణలో గ్రామ సచివాలయం సిబ్బంది, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు హాజరయ్యారు. లబ్ధిదారులకు పింఛన్ మొత్తాలను సకాలంలో అందజేస్తున్నందుకు లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.