ఇవాళ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్న పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ, ఛత్తీస్గఢ్, హర్యానా, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పంజాబ్, పుదుచ్చేరి.. దేశ పురోగతికి అద్భుతమైన కృషి చేశాయని ఆమె కొనియాడారు. ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలోని ప్రజలందరూ నిరంతర శ్రేయస్సుతో ఉండాలని ఆకాంక్షించారు.