బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో రాబోతున్న సినిమా ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’. ఇందులో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా వాటిపై దర్శకుడు అపూర్వ లఖియా స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. వాటిని కొట్టిపారేశారు. ఈ ప్రాజెక్టులో అమితాబ్ నటించడం లేదని స్పష్టం చేశారు.