కృష్ణా: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం పెడన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి, ఉదయం 11 గంటలకు పెడన చేరుకోనున్నారు. తుఫాన్ ప్రభావంతో పంటల నష్టం తీవ్రంగా నమోదైన ప్రాంతాలను స్వయంగా పరిశీలించి. రైతుల సమస్యలు తెలుసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.