ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50కోట్లు కేటాయిస్తూ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద కేఎంసీకి రూ.50 కోట్లు మంజూరు చేయగా, ఇందులో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వాటా రూ.40 కోట్లు, రాష్ట్ర వాటా రూ.10 కోట్లుగా నిర్ణయించారు.