WGL: దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో శనివారం ఉదయం ఒకే ఆవుకు మూడు దూడలు జన్మించిన ఘటన సంచలనం రేపింది. కృత్రిమ గర్భధారణ ద్వారా మేలు జాతి రకాలు జన్మించాయని గోపాల మిత్ర డా. అక్బర్ పాషా తెలిపారు. ఈ అద్భుతానికి రైతు ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. దీంతో ఆవును చూసేందుకు గ్రామంలోని ప్రజలు తరలివస్తున్నారు.