KDP: కాశినాయన మండలంలోని కొట్టాల పల్లె గ్రామ సమీపంలో శనివారం టైర్ పంక్చరై స్కూల్ వ్యాన్ చెరువు కట్ట మీద నుంచి పొలాల్లోకి దూసుకువెళ్లింది. ప్రమాద సమయంలో వ్యాన్లో ఆరుగురు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. వారికి ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనకు కారణం రోడ్డు వెడల్పు లేకపోవడం, రోడ్డుకు ఇరువైపులా సేఫ్టీ డివైడర్స్ లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు.