నువ్వులలో ఫైబర్, ఐరన్, కాల్షియం, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు ఎముకల ఆరోగ్యం మెరుగుపడి బలంగా మారుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది.