TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ BRS తరఫున మల్లారెడ్డి తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే సెలూన్ షాపు, టీ స్టాల్లో ప్రచారం నిర్వహించిన ఆయన.. తాజాగా ఓ హోటల్లో కూర్చొని స్థానికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన ఆయన.. తమ అభ్యర్థి మాగంటి సునీతకు ఓటు వేయాలని కోరారు.