SRD: సంగారెడ్డి పట్టణంలోని 16వ వార్డులో విద్యుత్ శాఖ అధికారులు బస్తీ బాట కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ట్రాన్స్ ఫార్మర్ చుట్టు పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. ఇంటింటికి తిరిగి విద్యుత్ సరఫరా తీరని అడిగి తెలుసుకున్నారు. లో వోల్టేజ్ ఉన్నచోట సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఈ స్వామి పాల్గొన్నారు.