కృష్ణా: మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్ సమీపంలోని ప్రధాన రహదారిపై ఆవులు సంచరించడం ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. పెడన – మంగినపూడి రహదారి గుండా వాహనాలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించడంతో ప్రమాద భయం నెలకొంది. అధికారులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ పశువుల యజమానులలో మార్పు లేకపోవడం ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది.