రంజీ ట్రోఫీ-2025లో టీమిండియా వెటరన్ ప్లేయర్ కరుణ్ నాయర్ అదరగొడుతున్నాడు. తిరువనంతపురం వేదికగా కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో కరుణ్ నాయర్ సెంచరీతో చెలరేగాడు. 163 బంతుల్లో తన 26వ ఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం 142 పరుగుల వద్ద తన బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. దీంతో సెలక్టర్లకు నాయర్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.