NZB: ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నేడు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం సుదర్శన్ రెడ్డిని ఇటీవల ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రిని కలిసి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సీఎం సుదర్శన్ రెడ్డిని సన్మానించారు.