ATP: SP జగదీష్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. రహదారి భద్రతా నియమాల అమలు, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా అన్ని పట్టణాలు, జాతీయ రహదారులపై తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ధరించని, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్‌తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.