KNR: జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షానికి తడిసిన ధాన్యాన్ని సేకరిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 785 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని గుర్తించామని, IKP, PACs ద్వారా కొనుగోలు బాయిల్డ్ రైస్ మిల్స్‌ను తరలించినట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు కొంతమంది రైతులకు సుమారుగా రూ. 57 లక్షలు జమ చేశామని తెలిపారు.