PPM: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందిస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. శనివారం సాలూరు మున్సిపాలిటీ 17వ వార్డు వెలమపేటలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నగదు అందజేశారు. ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందన్నారు.