HNK: ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామంలో శనివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గోనె కీర్తన (19) తన చెల్లితో జరిగిన చిన్న గొడవ కారణంగా మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.