ప్రకాశం: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించాలని కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ తెలిపారు. శనివారం పట్టణంలోని దేవాంగ నగర్లో పెన్షన్లు పంపిణీ చేయు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అర్హత కలిగి ఇప్పటివరకు పెన్షన్లు తీసుకోలేక పోవడం చాలా బాధాకరముగా ఉన్నదని, ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేయాలని కోరారు.