ప్రకాశం: సింగరాయకొండలో రాతి చెరువుకు గండి పడి నీరు వృథాగా పోతోంది. ఈ నీరు నూతనంగా వేసిన రైల్వే మూడవ లైను తాకుతూ వెళ్లడంతో రైల్వే లైన్‌కు కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాతి చెరువుకు గండి పడటంతో నీరంతా వృథాగా దిగువ ప్రాంతాలకు వెళ్లిపోతోంది. అధికారులు ఇటు వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయకట్టు రైతులు వాపోతున్నారు.