RR: శంషాబాద్ ఎయిర్ పోర్టులో హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం రాత్రి బ్యాంకాక్ నుంచి వచ్చిన అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి కదలికలపై కస్టమ్స్ అధికారులకు అనుమానం రాగా.. లగేజీని తనిఖీ చేశారు. లగేజీలో ఉన్న 3.6 కేజీల గంజాయిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. దీని విలువ రూ.3.6 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.