స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘తెలుసు కదా’. దీపావళి పండుగ బరిలో దిగిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్లో ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించారు.