KDP: ఇటీవల ముంథా తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు చాపాడు మండలం సీతారామపురం – అల్లాడుపల్లె మధ్యగల వంతెనపై రోడ్డు దెబ్బతింది. మంగళవారం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు వంతెనపై ఏకధాటిగా వరద నీరు పారింది. శనివారం ఉదయం తగ్గిపోగా వంతెనపై ఉన్న రోడ్డు దెబ్బతిన్నట్లుగా స్థానికులు తెలిపారు. దీంతో వంతెనపై వాహనాలు వెళ్లెందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.