ELR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఏలూరులో తన క్యాంపు కార్యాలయంలో డీఈవో నారాయణతో శుక్రవారం సమావేశమయ్యారు. పదో తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. గత ఏడాది కంటే ఉత్తీర్ణత స్థాయి గణనీయంగా పెంచే విధంగా కృషి చేయాలని ఆమె సూచించారు. ‘విజయ్ కేతనం’ పుస్తకాలను ముందుగానే పంపిణీ చేస్తామన్నారు.