NLG: కార్తీక పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదర్శనకు నవంబర్ 3న నల్లగొండ రీజియన్లోని అన్ని డిపోల నుంచి, ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు నల్లగొండ ఆర్టీసీ డిపో మేనేజర్ జానిరెడ్డి శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రద్దీని బట్టి సర్వీసులు నడిపిస్తామని, ఈ యాత్రలో కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనాలు కూడా ఉంటుందని తెలిపారు.