WGL: నర్సంపేట నేడు (మంగళవారం), రేపు (బుధవారం) నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌కి సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ తెలిపారు. నేడు పట్టణం మొత్తానికి బంద్ ఉండడం, రేపు కార్తీక మాస పర్వదినం కావడంతో రెండు రోజులపాటు మార్కెట్ మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం రైతు సోదరులు గమనించగలరని కోరారు.