KRNL: హాలహర్వి మండలం బాపురం గ్రామంలో వైసీపీ నాయకుల ఆహ్వానం మేరకు జోలాపురం నౌనెపటయ్య స్వామి దేవర మహోత్సవానికి మంగళవారం ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడి గ్రామంలోని స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.