ప్రకాశం: కనిగిరి ఐద్వా నాయకులు స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్ సయానా బేగంను కలిశారు. ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ప్రయోజనకరంగా ఉందని తెలిపారు. అయితే ఎక్స్ప్రెస్ సర్వీసులో కండక్టర్ లేని కారణంగా డ్రైవర్ ఒక్కడే రెండు విధులను నిర్వహించాల్సి వస్తుందని దీంతో గమ్యస్థానాలకు చేరేందుకు అధిక సమయం పడుతుందని తెలిపారు.